ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరిరంగన్‌కు గుండెపోటు !

Telugu Lo Computer
0


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ ఛైర్మన్ డా. కృష్ణస్వామి కస్తూరిరంగన్‌కు గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం శ్రీలంక  పర్యటనలో ఉన్న 83 ఏళ్ల కస్తూరి రంగన్‌కు గుండెపోటు రాగా మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం. కస్తూరిరంగన్‌ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రద్దయిన ప్రణాళికా సంఘం సభ్యుడిగానూ సేవలందించారు. అలాగే, 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. కస్తూరి రంగన్‌కు గుండెపోటు రావడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తంచేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)