హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన 19 ఏళ్ల యువతి, 23 ఏళ్ల వ్యక్తికి నాలుగు నెలల కిందట నిశ్చితార్థం జరిగింది. కొన్ని రోజుల కిందట ఆ నిశ్చితార్థాన్ని యువతి కుటుంబం రద్దు చేసింది. అయితే ఆ యువతి, ఆ వ్యక్తి గురుగ్రామ్‌లోని ముల్లాహెరా ప్రాంతంలో ఉంటున్నారు. ఆ మహిళ ఒక ఇంట్లో పని చేస్తున్నది. కాగా, సోమవారం మరో మహిళతో కలిసి ఆ యువతి నడిచి వస్తున్నది. ఆ వ్యక్తి కూడా నడుస్తూ అటు వైపు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నిశ్చితార్థం రద్దుపై వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి కత్తితో ఆమెను పలుమార్లు పొడిచాడు. వెంట ఉన్న మరో మహిళ అడ్డుకునేందుకు విఫలయత్నం చేసింది. స్థానికులు కూడా అతడ్ని అడ్డుకునేందుకు భయపడ్డారు. ఆ యువతి రక్తం మడుగుల్లో పడి చనిపోయింది. మరోవైపు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సంఘటనా స్థలంలో పడి ఉన్న కత్తిని, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో ఈ హత్యా సంఘటన రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. https://t.me/offerbazaramzon
నిశ్చితార్థం రద్దుతో యువతిని కత్తితో పొడిచిన యువకుడు
July 10, 2023
0
Tags