చండీగఢ్‌లోని అరుణ్ అనే ఆటో-రిక్షా డ్రైవర్ తన రిక్షాలో ప్రయాణించే ఎవరికైనా ఉచితంగా ఒక కిలో టమాటాలు అందజేస్తున్నాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. మొదటి ఐదు రైడ్స్ లో ప్రయాణించే వారికేనని ఓ మెలిక పెట్టాడు. అరుణ్ గత 12 సంవత్సరాలుగా ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికులకు ఉచిత ఆటో-రిక్షా రైడ్‌లను అందిస్తున్నారు. అదనంగా, అతను గర్భిణీ స్త్రీలను ఉచితంగా ఆసుపత్రులకు కూడా తీసుకువెళ్తున్నాడు. "ఇదే నా ఆదాయ వనరు. నేను జీవించే ఏకైక మార్గం. కానీ ఇలాంటి సేవలను అందించడం ద్వారా నాకు సంతృప్తిగా ఉంటుంది అని అరుణ్ చెప్పడం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. అంతేకాదు, అతను చండీగఢ్‌లో ఐదు రోజుల పాటు ఈ ఉచిత రిక్షా రైడ్‌ను అందిస్తానని కూడా ప్రకటించాడు. https://t.me/offerbazaramzon
మొదటి ఐదు రైడ్స్ లో ప్రయాణించే వారికి ఒక కిలో టమాటాలు ఫ్రీ !
July 19, 2023
0
Tags