ఉత్తరప్రదేశ్ లోని లక్నో, మలిహాబాద్ సమీపంలోని సింధర్వ గ్రామం కాజీఖేడలో సీతారాం తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సీతారాంకు అతని బంధువు గోవింద్ యాదవ్ తో తరచుగా గొడవలు జరిగేవి. ఇటీవల వారి మధ్య వివాదం మరింత ముదరడంతో సీతారాంపై ఉన్న కోపాన్ని అతని పిల్లలపై ప్రదర్శించాడు గోవింద్. జులై 13న సీతారాం ముగ్గురు పిల్లలు శివాని (8), స్నేహ(4), కృష్ణ(3) మార్కెట్ కు వెళ్తుండగా అటుగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన గోవింద్ వారిని చంపాలనే ఉద్దేశ్యంతో నిర్దయాక్షిణ్యంగా కారుతో గుద్దించేశాడు. అదృష్టవశాత్తు పిల్లలకు ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు. అక్కడున్నవారు పిల్లలను వెంటనే ఆసుపత్రికి తరలించి నిందితుడు పారిపోకుండా పట్టుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను సాక్ష్యాధారాలుగా పోలీసులు సేకరించారు. https://t.me/offerbazaramzon
తండ్రి మీద ఉన్న కక్షతో పిల్లలను చంపబోయాడు !
July 19, 2023
0
Tags