ఎయిరిండియాకు చెందిన ఓ సీనియర్ అధికారి ఎయిరిండియా ఏఐ 301 విమానంలో జులై 9న సిడ్నీ నుంచి ఢిల్లీకి బయలుదేరాడు. బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న ఆయన సీటు సరిగా లేకపోవడంతో ఎకానమీలోకి మార్చుకున్నాడు. అయితే ఆయన పక్కన సీటులో ఉన్న ప్రయాణికుడు బిగ్గరగా మాట్లాడుతుండంతో తోటి ప్యాసింజర్లు ఇబ్బందికి గురయ్యారు. దీంతో సదరు ఆఫీసర్ మెల్లగా మాట్లాడాలని అతనికి సూచించారు. అది నచ్చని ప్రయాణికుడు ఆగ్రహానికి గురై అధికారి చెంపను పగలగొట్టాడు. ఆయన తలను వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు. తననే మెల్లిగా మాట్లాడమంటావా అంటూ బూతులు తిట్టాడు. ప్రయాణికుడి వద్దకు వచ్చిన ఫ్లైట్ సిబ్బంది అలా చేయొద్దని హెచ్చరించారు. తొలుత మౌఖికంగా తర్వాత రాతపూర్వకంగా హెచ్చరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. విమానం ఢిల్లీ చేరుకున్న వెంటనే అతన్ని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో సదరు వ్యక్తి లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. ఈ ఘటనకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కు సమాచారం అందించినట్లు ఎయిరిండియా అధికారులు చెప్పారు. https://t.me/offerbazaramzon
బిగ్గరగా మాట్లాడొద్దన్నందుకు గూబ గుయ్యమనిపించాడు !
July 16, 2023
0
Tags