మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ రెస్టారెంట్‌ను సందర్శించిన సింధియా అక్కడి ఫుడ్‌ను ఆరగించి సిబ్బందితో కొద్దిసేపు ముచ్చటించారు. రెస్టారెంట్‌లో కలియతిరిగి అక్కడున్న వారిని ఆప్యాయంగా పలుకరించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వృద్ధురాలి నుంచి కేంద్రమంత్రి సింధియా ఆశీస్సులు తీసుకోవడం కనిపించింది. గ్వాలియర్‌లో ఈరోజు ఓ రెస్టారెంట్‌ను సందర్శించా..అక్కడ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు కుక్స్, పనివారితో ముచ్చటించా..వారితో వంటకాలు ఆపై స్ధానిక అంశాలపై ముచ్చటించానని ఆయన రాసుకొచ్చారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న సింధియా పలువురు ఎమ్మెల్యేలతో బీజేపీ గూటికి చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్పకూలింది. ఇక జ్యోతిరాదిత్య సింధియా గ్వాలియర్‌లో ప్రజలతో మమేకం కావడం పట్ల ఓ ట్విట్టర్ యూజర్ మీరు రాహుల్ గాంధీ నుంచి నేర్చుకుంటున్నారా అని అడగ్గా అలాంటిదేమీ లేదని కేంద్ర మంత్రి బదులిచ్చారు. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. https://t.me/offerbazaramzon
రెస్టారెంట్‌లో జ్యోతిరాదిత్య సింధియా మాటామంతీ !
July 07, 2023
0
Tags