తగ్గనున్న టమాటా ధరలు !

Telugu Lo Computer
0


దేశ వ్యాప్తంగా మండిపోతున్న టమాటా ధరలు 15 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి పంట మార్కెట్లకు చేరడం, వివిధ ప్రాంతాల నుంచి సరఫరా పెరగడమే దీనికి కారణమన్నారు. మరో నెల రోజుల్లో టమాటా ధరలు సాధారణ స్థాయికి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ సింగ్‌ శుక్రవారం మీడియాకు తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సొలన్‌, సిర్‌మౌర్‌ జిల్లా నుంచి ఢిల్లీకి సరఫరాలు మెరుగైనందున టమాటా ధర తగ్గుతోందని చెప్పారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)