మహారాష్ట్రలోని యావత్ మాల్ నుంచి పూణే వెళుతున్న బస్సులో శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమృద్ధి మహామార్గ్ ఎక్స్ ప్రెస్ వేపై బస్సు వెళుతుండగా బుల్దానా వద్ద మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో బస్సులోని 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు వ్యాపించినపుడు 32 మంది ప్రయాణికులున్నారు. ఈ ఘటనలో మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బుల్దానా సివిల్ ఆసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వెళుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగి మంటలు వ్యాపించాయి. https://t.me/offerbazaramzon
బస్సులో మంటలు చెలరేగి 25 మంది మృతి !
July 01, 2023
0
Tags