భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి ఇది నిదర్శనం !

Telugu Lo Computer
0


మెరికాలోని పెంటగాన్‌ను అధిగమించి గుజరాత్‌లోని సూరత్‌లో స్థాపితం అవుతోన్న భవనం, ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయ స్థలంగా మారనుందన్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇది సూరత్ వజ్రాల పరిశ్రమ డైనమిసాన్ని, వృద్ధిని చూపుతుందని చెప్పారు. భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి ఇది నిదర్శనమని ప్రధాని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు. వజ్రాల వ్యాపార కేంద్రం అయిన సూరత్ డైమండ్ బోర్స్ అని పిలువబడే ఈ భవనం, కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారులతో సహా 65వేల మంది వజ్రాల నిపుణుల కోసం "వన్-స్టాప్ డెస్టినేషన్" అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని మోడీ  ప్రారంభించనున్నారు. "సూరత్ డైమండ్ బోర్స్ వజ్రాల పరిశ్రమ వృద్ధిని ప్రదర్శిస్తుంది. ఇది భారతదేశ వ్యవస్థాపక స్ఫూర్తికి కూడా నిదర్శనం. ఇది వాణిజ్యం, ఆవిష్కరణలు, సహకారానికి కేంద్రంగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది" అని ప్రధాన మంత్రి ట్వీట్‌లో రాసుకొవచ్చారు. 15 అంతస్తుల ఈ భవనం 35 ఎకరాల స్థలంలో విస్తరించి, తొమ్మిది దీర్ఘచతురస్రాకార నిర్మాణాలను కలిగి ఉంది. విశాలమైన ఈ కాంప్లెక్స్‌ను నిర్మించిన కంపెనీ ప్రకారం, ఇది 7.1 మిలియన్ చదరపు అడుగుల అంతస్తు స్థలాన్ని కలిగి ఉంది. ఈ భవన నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టింది. అయితే ఈ కాంప్లెక్స్‌లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిక్రియేషనల్ జోన్, పార్కింగ్ ప్రాంతం కూడా ఉంది. కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 8 కింద ఈ భవనం రిజిస్టర్ చేయబడింది. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు కత్తిరించబడే సూరత్‌ను ప్రపంచ రత్నాల రాజధానిగా పిలుస్తారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)