రాజస్థాన్‌లోని జోద్‌పూర్ సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓసియాన్ సమీపంలో ఉన్న చౌరాయి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి నిప్పు అంటించి కాల్చి చంపారు. ఈ దుర్ఘటనలో ఆరు నెలల చిన్నారి కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ప్రతిపక్ష పార్టీ ఆందోళన చేపట్టింది. సీఎం గెహ్లాట్ స్వంత జిల్లాలోనే ఈ ఘటన జరగడం శోచనీయమని బీజేపీ ఆరోపించింది. పునరమ్ అనే 55 ఏళ్ల వ్యక్తి ఇంటిని దగ్ధం చేశారు. ఈ ఘటనలో పునరమ్‌తో పాటు ఆయన భార్య భన్వరి, కోడలు దాపు, ఆమె ఆరేళ్ల కుమార్తె అవశేషాలను గుర్తించారు. ఆ శరీరాలు మంటల్లో పూర్తిగా కాలిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ముందుగా గొంతులు కోసి హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కక్షల వల్లే ఈ హత్యలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. https://t.me/offerbazaramzon
ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని కాల్చి చంపారు !
July 19, 2023
0
Tags