ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ సక్సేనాకు సుప్రీంకోర్టు మొట్టికాయలు

Telugu Lo Computer
0


ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వికె. సక్సేనాకు సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ పదవికి మాజీ న్యాయమూర్తి ఉమేష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించకూడదని కోర్టు హెచ్చరించింది. ప్రమాణస్వీకారోత్సవాన్ని వాయిదా వేయడంతో పాటు ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.  అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఉమేష్‌ కుమార్‌ను ఢిల్లీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ (డిఇఆర్‌సి) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. సోమవారం సాయంత్రం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు జస్టిస్‌ ఉమేష్‌ కుమార్‌కు సమాచారం ఇచ్చారు. అయితే ఆప్‌ నేత, విద్యుత్‌ శాఖ మంత్రి అతిషి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. డిజిటల్‌ యుగంలో ఇదేం తీరు అంటూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కి లేఖ రాశారు. 'ఈ డిజిటల్‌ యుగంలో రాష్ట్రపతి 2023 జూన్‌ 21న ఇచ్చిన నోటిఫికేషన్‌ను అమలు చేయకలేకపోతున్నట్లు మంత్రి వెల్లడించడం వింతగా అనిపిస్తోంది' అని సక్సేనా అసహనం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రక్రియను వర్చువల్‌గా పూర్తిచేయాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం పదిగంటలకు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. లెఫ్టినెంట్ చర్యను సవాలు చేస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. ఆప్ ప్రభుత్వం ఢిల్లీ ప్రజలకు అందిస్తున్న విద్యుత్ రాయితీలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)