మహిళ పోగొట్టుకున్న ఐ ఫోన్ దొరికింది !

Telugu Lo Computer
0


ముంబయిలో ఓ మహిళ తన పోగొట్టుకున్న ఐఫోన్ తిరిగి పొందడానికి ఆటో డ్రైవర్, స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్ ఎలా సాయం చేసారో సుదీర్ఘమైన తన ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. Historywali అనే ట్విట్టర్ యూజర్ తన ఐఫోన్ 12 మినీ ఆటోలో పోగొట్టుకున్నారు. ఇక ఐ ఫోన్ పోగానే పరిస్థితి ఎలా ఉంటుంది? తీవ్ర ఆందోళనలో ఉన్న ఆమె తాను ఆటో ఎక్కిన ఆటో స్టాండ్ వైపు పరుగులు తీసింది. అక్కడ ఉన్నచాలామంది ఆటోడ్రైవర్ల సాయంతో తిరిగి తన ఫోన్ పొందగలిగింది. రాహుల్ కుమార్ అనే స్విగ్గీ ఫుడ్ డెలివరీ ఏజెంట్, నీలేష్ అనే ఆటో డ్రైవర్ ద్వారా తను ఏ ఆటోలో అయితే ఫోన్ పోగొట్టుకుందో తిరిగి పొందగలింది. వారిందరికీ ధన్యవాదాలు చెప్పింది.   https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)