మయన్మార్‌ నుంచి మణిపూర్‌కు 700 మంది వలస !

Telugu Lo Computer
0


సుమారు 700 మందికి పైగా మయన్మార్‌ వాసులు మణిపూర్‌లోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరిలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అస్సాం రైఫిల్స్ సెక్టార్‌ 28 అందించిన సమాచారం ప్రకారం 718 మంది మయన్మార్‌ వాసులు జులై 23-24 తేదీల్లో మణిపూర్‌లోని చందేల్‌ జిల్లాలోకి ప్రవేశించారు. వీరిలో 301 మంది పిల్లలు, 208 మహిళలు, 209 మంది పురుషులు ఉన్నారు. వీరంతా సరైన ప్రయాణ పత్రాలు లేకుండా రాష్ట్రంలోకి ప్రవేశించారని వెల్లడించింది. ''సరైన ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన వారిని వెనక్కి పంపేయాలని అస్సాం రైఫిల్స్‌కు సూచించాం. వీసా, అధీకృత ప్రయాణ పత్రాలు లేకుండా మయన్మార్‌ నుంచి ఎవరిని మణిపూర్‌లో అనుమతించవద్దని కేంద్ర హోం శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలున్నాయి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మయన్మార్‌ వాసులను మణిపూర్‌లోకి అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అస్సాం రైఫిల్స్‌కు తెలియజేశాం'' అని మణిపూర్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్ వినీత్‌ జోషి తెలిపారు. మణిపూర్‌లో ఆందోళనకారులకు మయన్మార్‌ నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నట్లు గత నెలలో ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. గత నెలలో మయన్మార్‌ నుంచి మణిపుర్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న నలుగురిని భద్రతా దళాలు అరెస్టు చేశాయి. ఈ క్రమంలో మయన్మార్‌ వాసులు ప్రవేశించడంపై మణిపూర్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)