20 ఏళ్లలో తరువాత మహిళను ఉరితీయనున్న సింగపూర్‌ !

Telugu Lo Computer
0


మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మరణ శిక్ష పడిన ఇద్దరు దోషులను సింగపూర్‌ ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం సింగపూర్‌లో గత 20 ఏళ్లలో ఇది తొలిసారి కావడం గమనార్హం. 50 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని ఈ బుధవారం (జులై 26) చాంగీ జైలులో ఉరితీయనున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్‌ఫర్మేటివ్‌ జస్టిస్‌ కలెక్టివ్‌ (టీజేసీ) వెల్లడించింది. ఇక, వచ్చే శుక్రవారం (జులై 28) 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి కూడా ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 30 గ్రాముల హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. గతంలో డ్రగ్‌ ట్రాఫికింగ్‌ కేసులో దోషిగా తేలిన 36 ఏళ్ల మహిళ యెన్‌ మే వుయెన్‌కు 2004లో ఉరిశిక్ష అమలు చేశారని టీజేసీ కార్యకర్త కోకిల అన్నామలై తెలిపారు. అయితే ఈ ఇద్దరి ఉరిశిక్ష అమలును నిలిపివేయాలని హక్కుల సంఘాలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. సింగపూర్‌లో హత్యలు, కిడ్నాప్‌ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. ఇక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు కూడా అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు. 500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్‌ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష తప్పదు.  https://t.me/offerbazaramzon


Post a Comment

0Comments

Post a Comment (0)