వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనల్లో రైల్వే శాఖకు రూ.55లక్షల మేర నష్టం !

Telugu Lo Computer
0


వందే భారత్‌ రైళ్లపై దేశంలో పలుచోట్ల ఆకతాయిలు రాళ్లు రువ్విన ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో రైల్వేశాఖకు ఇప్పటివరకు రూ.55.60లక్షల మేర నష్టం వాటిల్లినట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. 2019 నుంచి ఇప్పటివరకు వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్వడంతో తమ శాఖకు జరిగిన ఆస్తి నష్టం వివరాలను బుధవారం ఆయన లోక్‌సభకు తెలిపారు. ఆయా ఘటనలకు సంబంధించి ఇప్పటివరకు 151మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అయితే, రాళ్లు రువ్విన ఘటనల్లో ఎవరూ చనిపోవడం గానీ, చోరీ, ప్రయాణీకులకు చెందిన వస్తువులు ధ్వంసం కావడం గానీ జరగలేదన్నారు. 2019 నుంచి 2023 జూన్‌ వరకు వందే భారత్‌ రైళ్లపై రాళ్లు రువ్విన ఘటనలతో రైల్వే శాఖకు రూ. 55.60 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఈ విధ్వంసాన్ని అడ్డుకోవడంతో పాటు ప్రయాణికుల ప్రాణాలను, రైల్వే ఆస్తులను కాపాడేందుకు ఆర్‌పీఎఫ్‌ అధికారులు జీపీఆర్‌/జిల్లా పోలీస్‌/అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకొని పనిచేస్తోందన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగితే ఉత్పన్నమయ్యే పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. రైళ్లపై విధ్వంసానికి అవకాశం ఉన్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఎస్కార్టింగ్ పార్టీలకు అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. కదిలే రైళ్లపై దాడి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాలు జారీ చేశామన్న ఆయన.. రెగ్యులర్‌ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)