ఇండియా ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు : అధిర్ రంజన్ చౌదరి - కాంగ్రెస్,గౌరవ్ గొగొయ్ - కాంగ్రెస్, రాజీవ్ రంజన్ (లలన్ సింగ్) - జనతాదళ్ (యూ), సుస్మితా దేవ్ - తృణమూల్ కాంగ్రెస్, కణిమొళి కరుణానిధి - డీఎంకే, సందోశ్ కుమార్ - సీపీఐ, ఏఏ రహీమ్ - సీపీఎం, ప్రొఫెసర్. మనోజ్ కుమార్ ఝా - ఆర్జేడీ, జావేద్ అలీ ఖాన్ - సమాజ్ వాది పార్టీ, మహువా మజీ - జార్ఖండ్ ముక్తి మోర్చ, పిపి. మహ్మద్ ఫైజల్ - నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, అనీల్ ప్రసాద్ హేగ్డే - జనతాదళ్ (యూ), ఈటీ. మహ్మద్ బషీర్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎన్‌కే. ప్రేమ చంద్రన్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, సుశీల్ గుప్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ సావంత్, శివసేన, డి. రవికుమార్, విడుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే), తిరు తోల్ తరుమవలవన్, వీసీకే, జయంత్ సింగ్, రాష్ట్రీయ లోక్ దళ్, ఫులో దేవి నేతమ్, కాంగ్రెస్. https://t.me/offerbazaramzon
20 మంది ఎంపీల బృందాన్ని ప్రకటించిన 'ఇండియా'
July 28, 2023
0
ఈ నెల 29, 30న మణిపూర్‌కు ఒక నిజనిర్ధారణ కమిటీని పంపాలని ప్రతిపక్ష 'ఇండియా' కూటమి నిర్ణయించింది. ఇందుకు ఇండియా కూటమిలోని పలు పార్టీలకు చెందిన 20 మంది ఎంపీలను ఎంపిక చేసింది. ఈ బృందం రెండు రోజుల పాటు మణిపూర్ రాష్ట్రంలో పర్యటించనున్నది. మైదాన ప్రాంతంతో పాటు పర్వత, లోయ ప్రాంతాల్లో కూడా ఈ నిజ నిర్ధారణ బృందం పర్యటిస్తుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులతో భేటీ కానున్నది. అలాగే పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను బృందం తెలుసుకుంటుంది.
Tags