మోడీకి ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్న జో బైడెన్ !

Telugu Lo Computer
0


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఈ నెల 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రైవేట్ డిన్నర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20న మోదీ రెండు దేశాల పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 5 రోజుల పాటు అమెరికా, ఈజిప్టుల్లో పర్యటిస్తారు. జో బైడెన్ తో పాటు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్డెల్ ఫట్టాహ్ తో మోడీ  సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని, అదే రోజు రాత్రి జో బైడెన్ తో ప్రైవేట్ డిన్నర్ కార్యక్రమానికి మోడీ  హాజరవుతారు. ఆ తదుపరి రోజు వాషింగ్టన్‌లోని వైట్ హౌస్ లో మోదీకి అధికారికంగా స్వాగతం పలుకుతారు. బైడెన్‌ తో మోడీ  అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. ఆ రోజున కూడా భారత ప్రధాని గౌరవార్థం జో బైడెన్ దంపతులు ప్రభుత్వ లాంఛనాలతో డిన్నర్ ఇస్తారు. ఈ నేపథ్యంలోనే అంతకు ముందు రోజున కూడా బైడెన్ ప్రైవేటు డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)