మైనర్ బాలికను రేప్ చేసిన భోజ్‌పురి సింగర్ అరెస్టు

Telugu Lo Computer
0


మైనర్ బాలికను రేప్ చేసిన కేసులో భోజ్‌పురి గాయకుడ్ని బాబుల్ బిహారీని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్‌లో 27వేల మంది ఫాలోవర్లు ఉన్న ఆ సింగర్ అసలు పేరు అభిషేక్‌. రెండేళ్ల క్రితం రాజీవ్ నగర్ ఏరియాలో ఉన్న అతను.. ఓ 13 ఏళ్ల అమ్మాయిని మోసం చేశాడు. ముందుగా ఆమెతో స్నేహం చేసి ఆ తర్వాత ఓ హోటల్ గదికి తీసుకువెళ్లి రేప్ చేశాడు. ఇటీవల ఆ సింగర్ తన వద్ద ఉన్న మైనర్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఆ ఫోటోలను చూసిన అమ్మాయి పేరెంట్స్ షాక్ అయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయిని అడిగి తెలుసుకున్నారు. సింగర్ అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుసుకున్న ఆ అమ్మాయి పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో ప్రకారం కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన కొన్ని క్షణాలకే అతన్ని అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)