ముంబై మీరా రోడ్డు హత్య కేసు నిందితుడు సంచలన విషయాలు వెల్లడించాడు. తనకు హెచ్ఐవీ పాజిటివ్ ఉందని, హతురాలు సర్వసతి వైద్యకు, తనకు మధ్య ఎంతో సుహృద్భావ సంబంధాలు ఉన్నాయని నిందితుడు మనోజ్ సానే సంచలన విషయాలు బయటపెట్టాడు. సరస్వతి వైద్యతో తనకు ఎలాంటి శారీరక సంబంధం లేదని కూడా పోలీసుల ఇంటరాగేషన్‌లో వెల్లడించినట్టు తెలుస్తోంది. గీతానగర్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో కొన్నేళ్లుగా మనోజ్ సానే (56), సరస్వతి వైద్య (32) సహజీవనం సాగిస్తున్నారు. సరస్వతి వైద్యను అత్యంత కిరాతకంగా మనోజ్ సానే గత ఆదివారం చంపడం ఆలస్యంగా వెలుగుచూసింది. సరస్వతిని చంపిన తర్వాత ట్రీకట్టర్‌లో ఆమె మృతదేహాన్ని 20 ముక్కలు చేసి, వంటగదిలో 3 బకెట్లలో ఉంచి, ఆ ముక్కలను ఉడకబెట్టి వీధీ కుక్కలకు వేసిన ఘటన దేశ ఆర్థిక రాజధానిలో సంచలనం సృష్టించింది. మీరా రోడ్డు ఫ్లాట్‌లో గత మూడేళ్లుగా తాము ఉంటున్నామని, 2014 నుంచి సరస్వతి తనకు తెలుసునని, అప్పట్లో తాను రేషన్ దుకాణంలో పని చేస్తున్నట్టు ఇద్దరికీ పరిచయమైందని పోలీసులకు మనోజ్ వెల్లడించినట్టు తెలుస్తోంది. 2008లో తాను యాక్సిండెంట్‌కు గురికావడంతో చికిత్స సమయంలో హెచ్ఐవీ ఉన్నట్టు వైద్యపరీక్షల్లో తేలిందని, అప్పటి నుంచి సుదీర్ఘకాలంగా చికిత్స తీసుకుంటున్నానని పోలీసులకు వెల్లడించాడు. సరస్వతి తనకు కుమార్తె లాంటిదని, తానంటే ఎంతో ఆప్యాయంగా ఉండేదని చెప్పాడు. ఇద్దరూ నివసిస్తున్న ఫ్లాట్‌లోని గోడపై ఒక బోర్డు కూడా ఉంది. సరస్వతితో 10వ తరగతి పరీక్ష రాయించేందుకు మేథమెటిక్స్ చెప్పేవాడని తెలిపాడు. కాగా, సరస్వతి వైద్య ఒక అనాథని, ఆమెకు బంధువులు లేరని పోలీసులు మంగళవారంనాడు వెల్లడించారు. అయితే, సరస్వతి చెల్లెళ్లు ముగ్గురు తమ స్టేట్‌మెంట్ రికార్డు చేరేందుకు శుక్రవారం నాడు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. అనాథ శరణాలయంలో పెరిగిన సరస్వతి అక్కడి సన్నిహితులతో మాత్రం తన అంకుల్‌తో కలిసి ఉంటున్నట్టు, అతను బాగా డబ్బున్న వాడని, బట్టల మిల్ ఉండేదని చెప్పేది. కాగా, తాను ఐటీఐ చదువుకుని ఉద్యోగం రాకపోవడంతో రేషన్ దుకాణంలో పని చేసేవాడినని మనోజ్ పోలీసులకు చెప్పాడు. కాగా, సరస్వతి హత్య కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేయడంతో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూసే అవకాశాలు ఉన్నాయి.
నాకు హెచ్ఐవి పాజిటివ్ ఉంది !
June 09, 2023
0
Tags