మణిపూర్ లో చెలరేగిన అల్లర్లపై దర్యాప్తు ప్రారంభించిన కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇప్పటి వరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు పేర్కొంది. ఈ హింసాత్మక ఘటనలపై విచారణ వేగవంతం చేసినట్లు శుక్రవారం సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. దీనితో పాటు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సైతం విచారణలో ఉంది. సీబీఐ ఆదేశాల మేరకు సిట్ కేసులు నమోదు చేసి విచారణ చేస్తోంది. ఈ అల్లర్లు రేగడానికి ముందస్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో సైతం దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. మణిపూర్ అల్లర్ల కేసును హైకోర్టు రిటైర్డ్జ్ జడ్జి నేతృత్వంలోని ప్రత్యేక కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బృందం విచారిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఒకటవ తేదీన ప్రకటించారు. అంతకు ముందు ఆయన మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి పక్షపాతానికి తావు లేకుండా, చట్టబద్ధంగా పూర్తి నిష్పాక్షికంగా దర్యాప్తు కొనసాగుతుందని మణిపూర్ ప్రజలకు తాను తెలియజేస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అలాగే అల్లర్లలో నష్టపోయిన వారికి ఆర్థిక మద్దతుతో పాటు పునరావాసం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మణిపూర్ అల్లర్లపై ఆరు కేసులు నమోదు !
June 09, 2023
0
Tags