ఉత్తరప్రదేశ్‌లోని లఖ్‌నవూలో గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవా దారుణ హత్య కేసులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. సంజీవ్ జీవాను హత్య చేసేందుకు నిందితుడు విజయ్ యాదవ్ రూ.20లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా కేవలం రూ.5 వేలు మాత్రమే తీసుకున్నాడు. హత్య జరిగిన తర్వాత మిగతా పెండింగ్ అమౌంట్ ఇస్తామనే ఒప్పందం జరిగింది. హత్యకు గురయ్యే వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే కేవలం రూ.20 లక్షలకు డీల్ ఒకే కావడంతో విజయ్ యాదవ్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది. ఇందులో భాగంగానే రూ.20 లక్షలకు డీల్ ఒకే కాగానే లఖ్‌నవూ సివిల్ కోర్టు ఆవరణలోనే గ్యాంగ్‌స్టర్ సంజీవ్ జీవాను విజయ్ యాదవ్ చంపేశాడు. జీవాపై అనేక క్రిమినల్ కేసులు ఉండటంతో ఓ కేసులో కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకొచ్చిన సమయంలో హత్య జరిగింది. పశ్చిమ యూపీలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ అయిన సంజీవ్ జీవా వివాదాస్పద నేత ముఖ్తార్ అన్సారీకి అత్యంత సన్నిహితుడు. బీజేపీ ఎమ్మెల్యే బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో అన్సారీ నిందితుడిగా ఉండగా, సహ నిందితుడిగా జీవా ఉన్నాడు.
వ్యక్తి ఎవరో కూడా తెలియకుండానే చంపేశాడు !
June 09, 2023
0
Tags