మావోయిస్టు నేత కటకం సుదర్శన్‌ మృతి

Telugu Lo Computer
0


మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్‌ కమిటీ సభ్యుడు ఆనంద్‌ అలియాస్‌ కటకం సుదర్శన్‌ గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సుదర్శన్‌ స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా బెల్లంపల్లిలోని కన్నాలబస్తి. వరంగల్‌లో పాలిటెక్నిక్‌ విద్యను అభ్యసించిన ఆయన కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితులై 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో గడుపుతున్నారు. మావోయిస్టు పార్టీలో అంచలంచలుగా ఎదిగిన ఆయన సెంట్రల్‌ కమిటీ  మెంబర్‌గా ఉన్నారు. ఆయనను ఆనంద్‌, మోహన్‌, వీరేందర్‌జీ అని వివిధ పేర్లతో పిలుస్తారు. సుదర్శన్‌పై హత్య కేసు సహా ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 17 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. రెండేండ్ల క్రితం ఛత్తీస్‌గడ్‌లోని దంతేవాడలో  సీఆర్‌పీఎఫ్‌  జవాన్లపై జరిగిన మావోయిస్టుల దాడిలో సుదర్శన్‌ హస్తం ఉన్నది. ఈ దాడిలో 70 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చనిపోయిన విషయం తెలిసిందే. ఇక గత నెల 28న ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ నాయకులపై జరిగిన దాడికి పథక రచన చేసింది ఆయననేని పోలీసులు అనుమానిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా యాన ఉత్తర తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని దండకార్యణంలో  ఉన్న ఆదివాసీ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఆయన సతీమణి, మావోయిస్టు నాయకురాలు సాధన గత కొన్నేండ్ల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)