కేరళకు చెందిన రోజన్ పరంబిల్ స్విట్జర్లాండ్‌లోని ఓ వృద్ధాశ్రమంలో పని చేస్తున్నారు. కోవిడ్ కారణంగా దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసి ఆయన షాకయ్యారు. వీరిద్దరు కలిసిన మధురమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మిస్టర్ పరంబిల్ తన తల్లిని ఆమె స్వస్థలమైన అతిరుంపుజ చూపించడానికి ఎత్తుకుని కారు దగ్గరకు తీసుకెళతారు. ఆ సమయంలో ఓ స్త్రీ టీ కప్పు అందిస్తుంటే దానిని సంతోషంగా ఆవిడ సిప్ చేసింది. ఆ తరువాత తల్లికొడుకులిద్దరూ సెల్ఫీని తీసుకున్నారు. పరంబిల్ కొన్నేళ్ల క్రితం స్విట్జర్లాండ్ తీసుకెళ్లి యూరప్ మొత్తం చూపించారట. అక్కడి ప్రదేశాలు చూసి ఆవిడ ముచ్చటపడిందట. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఇండియా రాగానే అమ్మని చూడగానే గుండె పగిలిపోయిందని పరంబిల్ అన్నారు. ఆమె చాలా పెద్దది అయిపోయినట్లు.. సరిగ్గా నిలబడలేక, నడవలేని స్థితిలో కనిపించిందట. ఎలాగైనా ఆమెను బయటకు తీసుకెళ్లాలని పరంబిల్ డిసైడ్ అయ్యారు. కారులో వెళ్తుంటే చాలా ప్రదేశాలు ఆమెకు గుర్తు రాలేదట. ప్రయాణంలో ఆమె బాగా అలసిపోయినా తను కోరుకునే విధంగా చూపించినందుకు సంతోషంగా ఉందని పరంబిల్ అన్నారు. పరంబిల్ తరపున వీడియోను, ఆయన నోట్‌ను officialhumansofkeralam ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్టును షేర్ చేశారు. ఇక ఈ వీడియో ఇంటర్నెట్‌ను కదిలించింది. 'ఈ పోస్టు చూసి కన్నీరు ఆపుకోలేకపోయాను' అని ఒకరు.. 'అమ్మని మరవలేము.. వారితో గడిపిన ప్రతిక్షణం ఎంతో విలువైనది.. జ్ఞాపకాలు మాత్రమే తర్వాత మిగిలిపోతాయి'.. అంటూ ఇంకొకరు కామెంట్లు చేశారు. ముఖ్యంగా అమ్మా, నాన్నలకు దూరంగా ఉన్న బిడ్డలను ఈ వీడియో మరింతగా కదిలించింది.
Post a Comment
0Comments
3/related/default