గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిపై జైరాం రమేష్ ఆగ్రహం

Telugu Lo Computer
0


ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్‌కు చెందిన గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి 2021ని ప్రకటించడం పట్ల కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోడీ సారధ్యంలోని జ్యూరీ ప్రతిష్టాత్మక అవార్డుకు గీతా ప్రెస్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఈ అవార్డుకు గీతా ప్రెస్‌ను ఎంపిక చేయడం అపహాస్యమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతిని ఇవ్వడం సావర్కర్‌, గాడ్సేలను సన్మానించడంలా ఉంటుందని ట్విట్టర్ వేదికగా ఆయన పేర్కొన్నారు. అక్షయ ముకుల్ అనే రచయిత గీతా ప్రెస్‌..హిందూ భారత నిర్మాణం పేరుతో బయోగ్రఫీ రాశారని, ఈ పుస్తకం మహాత్మా గాంధీతో ముకుల్‌కు ఉన్న విభేదాల గురించి ప్రస్తావిస్తుందని జైరాం రమేష్ చెప్పుకొచ్చారు. ఇక ప్రపంచంలో అతిపెద్ద పబ్లిషర్స్‌లో గీతా ప్రెస్ ఒకటని, ఈ ప్రచురణ సంస్ధ 14 భాషల్లో 41.7 కోట్ల పుస్తకాలను ప్రచురించిందని, 16.21 కోట్ల భగవద్గీత కాపీలను ప్రచురించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక వికాసానికి గత శతాబ్ధ కాలంగా విశేష సేవలందిస్తోన్న గీతా ప్రెస్ ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతి 2021కి ఎంపిక కావడం విశేషమని ప్రధాని మోడీ  పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)