హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు భారీగా డ్రగ్స్‌ని పట్టుకున్నారు. వట్టేపల్లి, దుర్గానగర్ చౌరస్తా దగ్గర డ్రగ్స్ అమ్ముతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు. మొత్తం 400 మెఫెంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్‌లను సీజ్ చేశారు. జిమ్ ట్రైనర్ నితీష్, రాహుల్‌తో పాటు సోహెల్‌లను అరెస్ట్ చేశారు అధికారులు. జిమ్ ట్రైనరే ఈ డ్రగ్స్‌ని అమ్ముతున్నాడని తెలుసుకున్న అధికారులు.. ఈ ఇంజక్షన్స్‌ని ఎక్కడి నుంచి తెస్తున్నారు? దీని వెనక ఉన్న ప్రధాన సూత్రధారి ఎవరు? అనే కొణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌లో తరచూ డ్రగ్ మాఫియా ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. కాలేజీ కుర్రాళ్లు కూడా డ్రగ్స్ వాడుతూ అప్పుడప్పుడూ పోలీసులకు చిక్కుతున్నారు. న్యూఇయర్ వేడుకల్లోనూ భారీగా డ్రగ్స్ చేతులు మారుతున్నాయి. ఇలా తెలంగాణలో ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. డ్రగ్స్ దందా మాత్రం సాగుతూనే ఉంది. పూర్తిగా దీన్ని అడ్డుకోవడం ప్రభుత్వం వల్ల కావట్లేదు. విదేశాల నుంచి కూడా డ్రగ్స్ అక్రమ మార్గాల్లో వస్తుండటంతో ప్రభుత్వానికి ఇదో పెద్ద సవాలవుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)