ప్రధాని కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలి : డీయూ కళాశాలల మార్గదర్శకాలు

Telugu Lo Computer
0


ఢిల్లీ విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా హాజరుకావాలని కళాశాలలు తమ నోటీసుల్లో పేర్కొన్నాయి. 'ప్రధాని పాల్గొంటున్న ఈ కార్యక్రమం లైవ్‌ స్ట్రీమింగ్‌కు ప్రతి విద్యార్థి హాజరుకావాలి. ట్రాఫిక్‌, ఇతర అంతరాయాలు ఏర్పడకుండా ఉదయం తొమ్మిది గంటల లోపు అంతా కళాశాలకు వచ్చేయాలి. నలుపు రంగు దుస్తులు ధరించవద్దు' అంటూ ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ కాలేజ్‌ సహా ఈ యూనివర్సిటీ పరిధిలోని పలు కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి. టీచర్లు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులందరూ కళాశాలలో జరుగుతున్న వర్చువల్ కార్యక్రమానికి హాజరుకావాలని డాక్టర్ భీమ్‌రావ్‌ కళాశాల తన నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఇది కాస్తా వివాదాస్పదంగా మారింది. అయితే.. ఈ తరహా నోటీసులు ఏమీ జారీ చేయలేదని హిందూ కళాశాల ప్రిన్సిపల్‌ అంజు శ్రీవాస్తవ వెల్లడించారు. దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని అన్నారు. వీటిపై పలు కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా స్పందించారు. తాము ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సిబ్బంది, విద్యార్థులను కోరామని, తప్పనిసరి అంటూ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)