ప్రేయాసి పెళ్ళికి వెళ్లిన ప్రియుడు !

Telugu Lo Computer
0


మిళనాడు, చెన్నైలోని అన్నానగర్‌కు చెందిన శరవణన్‌ పళనిస్వామి, సబిత అనే యువతి దాదాపు ఏడేళ్ల పాటు ఇద్దరూ ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. అయితే, అనుకోని కారణాల వల్ల వీరి ప్రేమ పెళ్లి పీటల వరకు వెళ్లలేకపోయింది. దీంతో ఇ‍ద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలోనే సబితకు వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. తాజాగా, సబిత పెళ్లి తురత్తని మురుగన్‌ దేవాలయంలో జరిగింది. ఈ పెళ్లికి శరవణన్‌ వెళ్లాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని. పెళ్లికి వెళ్లటమే కాకుండా తాను ప్రేమించిన అమ్మాయికి తన స్టైల్లో శుభాకాంక్షలు చెప్పాడు. కొంతమంది పిల్లల చేత నూతన దంపతులకు గులాబీ పువ్వులు అందించాడు. ముఖంపై చిరునవ్వుతో సబిత దంపతులకు శుభాకాంక్షలు చెప్పాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. '' ప్రేమలో ఓడినా, జీవితంలో తప్పకుండా గెలుస్తావు బ్రదర్‌''..'' వీడు అసలైన ప్రేమికుడురా బుజ్జీ''.. '' మనం ప్రేమించిన వాళ్లు సుఖంగా ఉండాలని కోరుకోవటమే నిజమైన ప్రేమ'' అంటూ కామెంట్లు చేస్తున్నారు. https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)