పట్టాలు తప్పిన గూడ్స్

Telugu Lo Computer
0


ఒడిశాలోని అంబడోల ప్రాంతంలో ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పింది. రాయగఢ్ జిల్లాలోని అంబడోల వద్ద ఓ గూడ్సు రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ ఆస్తి నష్టం మాత్రం జరిగింది. నాలుగు బోగీలు దెబ్బతినగా ట్రాక్ బాగా ధ్వంసమైంది. అయితే, ఈ ప్రమాదం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. ప్రమాద వార్త తెలియగానే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ గూడ్సు రైలు అంబడోలా నుంచి ప్రత్యేక మార్గంలో లాంజీగర్ వేదాంత లిమిటెడ్ ప్లాంట్‌లోకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మరోవైవు, ఇటీవల ఘోర రైలు ప్రమాదం జరిగిన బహానగ బజార్ రైల్వే స్టేషన్ వద్ద ట్రాక్ పునరుద్ధరణ పనులు ఇంకా జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను ఆది, సోమవారాలు రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వీటిలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే రైళ్లు కూడా ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)