మహారాష్ట్రలో అమానవీయ ఘటన !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. కూలీలను గొలుసులతో కట్టేసి వారితో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్ల దాష్టీకం వెలుగులోకి వచ్చింది. పొట్ట చేత పట్టుకుని వేరే ప్రాంతం నుంచి వలస వచ్చిన కూలీలతో కాంట్రాక్టర్లు అంత్యత దారుణంగా వారు ఎక్కడికి వెళ్లకుండా కనీసం కాలకృత్యాలు కూడా తీర్చుకోవానికి వెళ్లకుండా బావులు తవ్విస్తున్నారు. ఆ బావుల్లోనే కాలకృత్యాలు తీర్చుకోవాలని ఆ తరువాత వాటిని బక్కెట్లలోకి ఎత్తి వారిచేతనే పారవేయిస్తున్న అమానవీయ ఘటన బయటపడింది. కనీసం కడుపునిండా తిండికూడా పెట్టకుండా కూలీలలను ఇనుప గొలుసులతో కట్టేసి మరీ పనిచేయించుకుంటున్నారు కాంట్రాక్టర్లు. ఉస్మానాబాద్‌లో బావులు తవ్వటం కోసం కూలీలను తీసుకొచ్చి సంతోశ్ జాదవ్, కృష్ణ శిందే అనే కాంట్రాక్టర్లు వారితో రోజుకు 12గంటలు పనిచేయించుకుంటున్నారు. ఇటువంటి నిర్భంధంతో పనిచేయలేక కూలీలు రాత్రి సమయంలో పారిపోతారని వారిని గొలుసులతో బంధించి ఉంచుతున్నారు. రోజుకు ఒకే ఒక్కసారి భోజనం పెట్టేవారు. తెల్లవారు ఝామునే బావుల్లోకి దిగాలి. హింగోలీకి చెందిన 12 మంది కూలీల చేత ఇలా చేయించి ఒక్క రూపాయి కూలీ కూడా ఇవ్వలేదు. అలా కంటినిండా నిద్ర లేకుండా, కడుపు నిండా తిండి లేక అలసిపోయిన వారు ధైర్యం చేసి ఓ రోజు కొంతమంది తప్పించుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము పడే బాధల్ని చెప్పుకుని వాపోయారు. అది విన్న పోలీసులు బావుల తవ్వే ప్రాంతానికి వెళ్లి 11 మంది కూలీలకు విముక్తి కల్పించారు. వారిని వెంటనే ఆస్పత్రికి వైద్యం కోసం తరలించారు. దీనికి కారణమైన ఇద్దరు కాంట్రాక్టర్లు సహా నలుగురిని అరెస్ట్‌ చేశారు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)