ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్ పూర్ రైల్వే స్టేషన్ మీదుగా పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ గంటకు 110 కి.మీ వేగంతో దూసుకుపోతోంది. ప్లాట్ ఫారం మీద జనమంతా రైలు వేగానికి దూరంగా నిలబడి ఉన్నారు. అంతలోనే ఒక యువకుడు ఈ ట్రైన్ నుండి జారిపడ్డాడు. కింద పడ్డ ఆ యువకుడిని ట్రైన్ ఈడ్చుకుంటూ పోవడంతో ఆ స్పీడుకి ప్లాట్ ఫారంపై చాలా దూరం దొర్లుకుంటూ పోయాడు. ఈ ప్రమాదంలో యువకుడికి చిన్న గాయం కూడా కాలేదు సరికదా.. దొర్లడం ఆగిన తర్వాత రిలాక్స్ గా లేచి నిలబడి చేతులు దులుపుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ సంఘటనను లైవ్లో చూసినవారంతా నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయారు. ప్లాట్ ఫారం మీదనున్న ఓ ప్రయాణికుడు మాత్రం ఈ సన్నివేశాన్ని తన ఫోన్లో వీడియో తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.
వేగంగా వెళ్తున్న ట్రైన్ నుండి కిందపడ్డ యువకుడు !
June 21, 2023
0
Tags