బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ బీ టీమ్ అంటూ నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన 'బీ' టీమ్ అనిపిస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు ఉందని, అయితే బీఆర్‌ఎస్ను బీజేపీ బీ టీమ్ కాదా అనేది చూడాలన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీ బీ అంటూ శరద్ పవార్ అభివర్ణించడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. దేశ రాజకీయాల్లో అపర చాణక్యుడైన శరద్ పవార్ భారతదేశ సమకాలీన రాజకీయాల్ని చాలా దగ్గరి నుండి చూసిన వ్యక్తి అని చెప్పారు. అలాంటి శరద్ పవార్, కేసీఆర్ వ్యవహార శైలిని బట్టి బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో గమనించాలని సూచించారు. కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తున్న ఈ రసవత్తరమైన డ్రామాలో ప్రేక్షకులం, పావులం, వంచితులం మన తెలంగాణ ప్రజలమే. జాగో తెలంగాణ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.
బీజేపీకి బీఆర్ఎస్ 'బీ' టీమ్ !
June 18, 2023
0
Tags