మణిపూర్‌లో ఆగని హింస : ముగ్గురు కాల్చివేత

Telugu Lo Computer
0


మణిపూర్‌ లో హింస ఇంకా చల్లారలేదు. మణిపూర్‌లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా  లోని ఓ గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం సమయంలో మిలిటెంట్లు భద్రతా సిబ్బంది  వేషధారణలో వచ్చి సెర్చ్ ఆపరేషన్ సాకుతో కొంతమందిని ఇంటి నుంచి బయటకు పిలిచారు. ఆ తరువాత వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్‌పోకి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులోని ఖోకెన్ గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. మిలిటెంట్లు మెయిటీ వర్గానికి చెందిన వారుగా భావిస్తున్నారు. ఈ ఘటన కాంగ్‌పోక్‌పి, ఇంఫాల్ పశ్చిమ జిల్లాల సరిహద్దులోని ఖోకెన్ గ్రామం లో జరిగింది. మిలిటెంట్లు మెయిటీ వర్గానికి చెందిన వారుగా భావిస్తున్నారు. తుపాకీ శబ్దం రాగానే భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అప్పటికే భద్రతా దళాల వేషదారణలో వచ్చిన మిలిటెంట్లు పరారయ్యారు. ముగ్గురి మృతదేహాలను అస్సాం రైపిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరిపి ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణమైన వారికోసం మణిపూర్ పోలీసులు, అస్సాం రైఫిల్స్, ఆర్మీ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)