భారతీయ జాతీయ గీతాన్ని అమెరికా సింగర్ మేరీ మిల్‌బిన్ పాడారు. వాషింగ్టన్‌లో జరిగిన ప్రధాని మోడీ కార్యక్రమంలో ఆమె జనగణమణ పాటను పాడారు. వందలాది మంది ఆహ్వానితుల మధ్య ఆమె ఆ గీతాన్ని ఆలపించారు. సభకు హాజరైన జనం కూడా తనతో గొంతుకలిపి పాడడం సంతోషంగా ఉందని ఆమె అన్నారు. జనం గొంతుల్లో ఉన్న ఆ అభిమానాన్ని చూడవచ్చు అన్నారు. భారత జాతీయ గీతాన్ని ఆలపించడం సంతోషంగా ఉందని సింగర్ మేఈ మిల్‌బెన్ తెలిపారు. ఇది ఎప్పటికీ మరిచిపోని రోజు అని ఆమె తన ట్విట్టర్‌లో వెల్లడించారు. జనగణమన పాడిన తర్వాత ఆ సింగర్ స్టేజ్‌పై మోడీ కాళ్లకు పాదాభివందనం చేశారు.
జనగణమణ గీతాన్ని పాడిన అమెరికా సింగర్ మేరీ మిల్‌బిన్ !
June 24, 2023
0
Tags