జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం అడ్డుకున్నది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పూంచ్ జిల్లాలోని గుల్పూర్ సెక్టార్‌లో ఉన్న నల్లా ప్రాంతంలో సాయుధులైన ముగ్గురు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటేందుకు యత్నించారు. అది గుర్తించిన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ప్రతిగా వారు కాల్పులకు తెగబడటంతో ఓ సైనికుడు గాయపడ్డాడని అధికారులు తెలిపారు. సైనికులు కాల్పులు జరపడంతో సమీపంలో ఉన్న దట్టమైన అడవుల్లోకి ముగ్గురు ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టిందని, ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టామని వెల్లడించారు.
ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన జవాన్
June 24, 2023
0
Tags