రోడ్డు ప్రమాదంలో గర్భిణి మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన నిహారిక, రామగుండం మండలంలోని మల్యాలపల్లెకు చెందిన కత్తెరమల్ల క్రాంతి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ఓ మెగా మార్కెట్‌లో పని చేస్తోంది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. ఆధార్‌ అప్‌డేట్‌ కోసం భర్తతో సోమవారం స్కూటీపై ఎన్టీపీసీ రామగుండం వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్తుండగా క్రషర్‌నగర్‌ రాజీవ్‌ రహదారిపై పెద్దపల్లి వైపు వెళ్తున్న కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన నిహారికను గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న శిశువు కళ్లు తెరవకుండానే ప్రాణాలు విడిచింది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరేవారని, ఈలోగా ఇంత ఘోరం జరిగిందంటూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రిలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రికి వెళ్లి, మృతురాలి భర్త నుంచి ఫిర్యాదు స్వీకరించి, కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)