ఢిల్లీ మెట్రో రైలులో కొట్టుకున్న యువకులు !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో బోగీలో ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మెట్రోలో ప్రయాణిస్తుండగా తొలుత వీరి వివాదం వాదనతో మొదలైంది. ఆ తర్వాత ఘర్షణకు దిగారు. తోటి ప్రయాణికులు వారిని ఆపే ప్రయత్నం చేసినా వారు ఏ మాత్రం తగ్గలేదు. నిలబడటానికి స్థలం విషయంలో వీరి మధ్య వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన వీడియో వైరల్‌గా మారడంతో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌  స్పందించింది. ''మెట్రోలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అభ్యర్థిస్తున్నాం. ఎవరైనా అభ్యంతరకరంగా ప్రవర్తిస్తే వెంటనే డీఎంఆర్‌సీ హెల్ప్‌లైన్‌కి తెలియజేయాలి. ఇటీవల ఫ్లయింగ్‌ స్క్యాడ్‌లను కూడా నియమించాం. వీరు ప్రయాణికులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. అనుచిత ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటారు'' అని డీఎంఆర్‌సీ కార్పొరేట్‌ కమ్యూనికేషన్స్‌ ప్రిన్సిపల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనుజ్‌ దయాల్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)