తహసిల్దార్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు

Telugu Lo Computer
0


బెంగళూరు నగరంలోని కేఆర్ పురంలో తహసీల్దార్ గా ఉద్యోగం చేస్తున్న అజిత్ రాయ్ అలియాస్ అజిత్ ఇంటిపై కర్ణాటక లోకాయుక్త అధికారులు దాడులు చేసి సోదాలు కొనసాగిస్తున్నారు. అజిత్ రాయ్‌కి సంబంధించిన 11 వేర్వేరు చోట్ల లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. అజిత్ రాయ్ అతని బంధువులు, స్నేహితుల పేర్లతో అక్రమంగా ఆస్తులు రిజిస్టర్ చేశాడని వెలుగులోకి వచ్చింది. ఆయన ఇంట్లో బినామీ ఆస్తుల పత్రాలు కూడా లభ్యమయ్యాయని కన్నడ మీడియా తెలిపింది. ఆదాయానికి మంచి అక్రమంగా తహసిల్దార్ అజిత్ రాయ్ ఆస్తులు సంపాధించారని లోకాయుక్త అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. తహసిల్దార్ అజిత్ రాయ్ ఆదాయానికి, ఆయన ఇంట్లో దొరికిన ఆస్తులకు చాలా వ్యత్యాసం ఉండటంతో అధికారులు హడలిపోయారు, బెంగళూరులోని సహకార నగర్‌లోని అజిత్ రాయ్ నివాసంలోనే మకాం వేసిన అధికారులు పలు పత్రాలు పరిశీలించారు.

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా సరిహద్దులోని దొడ్డబళ్లాపూర్ (కర్ణాటక) సమీపంలో 98 ఎకరాల భూమి అజిత్ రాయ్ ఫ్యామిలీలోని కొందరి పేర్లతో ఉన్న దస్తావేజులను లోకాయుక్త అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని ఆ 98 ఎకరాల భూమి విలువ రూ.300 కోట్లకు పైగా ఉంటుందని లోకాయుక్త అధికారులు చెప్పారు. ఒకే చోట రూ. 300 కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించిన తహసిల్దార్ అజిత్ రాయ్ ఇంకా ఎన్ని వందల కోట్ల అక్రమాస్తులు సంపాధించాడు ? అని లోకాయుక్త అధికారులు ఆరా తీస్తున్నారు. మొత్తం మీద బెంగళూరులోని కేఆర్ పురం డివిజన్ లోని అన్ని విభాగాల్లో పని చేసే ప్రభుత్వ అధికారులు వందల కోట్ల అక్రమాస్తులు సంపాధిస్తున్నారని వెలుగు చూడటంతో స్థానిక ప్రజలు షాక్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అజిత్ కు అక్రమాస్తులు ఉన్నాయని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)