ఢిల్లీలో సినీ ఫక్కీలో దోపిడీ !

Telugu Lo Computer
0


ఢిల్లీ ప్రగతి మైదాన్ టెన్నెల్‌లో ఓ డెలివరీ ఏజెంట్, అతని సహచరుడి నుంచి నలుగురు గుర్తు తెలియన వ్యక్తులు తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలు దోచుకెళ్లారు. బాధితుడు డబ్బును డెలివరీ చేసేందుకు క్యాబ్‌లో గురుగ్రామ్ వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. ప్రగతి మైదాన్ టన్నెల్ దాదాపు 1.5 కిలోమీటర్లు ఉంటుంది. ఇది నోయిడా, సరయ్ కాలే ఖాన్‌లను కలుపుతుంది. అయితే ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజీనామా చేయాలని ట్వీట్ చేశారు. ''కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సురక్షితంగా ఉంచలేకపోతే.. మాకు అప్పగించండి.. నగరాన్ని, పౌరులను ఎలా సురక్షించాలో చేసిన చూపిస్తాం'' అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)