ప్రభాస్ నటించిన ఆదిపురుష్ బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. లోని వీఎఫ్‌ఎక్స్, ప్రభాస్ లుక్‌పై విమర్శలు, ట్రోలింగ్ వస్తున్నప్పటికీ వసూళ్లపై ఏ మాత్రం ప్రభావం చూపించడం. మొదటి రోజే రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఆదిపురుష్ రెండో రోజు కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. అయితే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చు. శనివారం (జూన్ 17)న ఆదిపురుష్ సుమారు రూ.60-80 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీకెండ్ కావడం, బరిలో మరే పెద్ద లేవీ లేకపోవడంతో ఆదివారం నుంచి కలెక్షన్లు పుంజుకునే అవకాశముందని తెలుస్తోంది. అయితే కలెక్షన్లు వస్తున్నా ఆదిపురుష్‌పై వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. కొన్ని హిందూ సంఘాలు పై కోర్టు మెట్లెక్కాయి. ఇలా ఓ పక్క వివాదాలు, ట్రోలింగ్, విమర్శలతో ప్రభాస్ ట్రెండింగ్‌లో ఉంది. ఇది కూడా కలెక్షన్లు పుంజుకోవడానికి ఒక కారణమని తెలుస్తోంది.రామాయణం మహాకావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ ను తెరకెక్కించారు. ప్రభాస్ రాముడి అవతారంలో ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చారు. జానకిగా కృతి సనన్ అభినయం అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక రావణాసురుడిగా సైఫ్ నటనకు ప్రశంసలు వస్తున్నాయి.ఇక లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ్ దత్ నాగే పాత్రలకు కూడా మంచి పేరు వస్తోంది.
200 కోట్ల క్లబ్‌లో 'ఆది పురుష్' !
June 18, 2023
0
Tags