ఫోన్‌పే తాజాగా సొంతంగానే పేమెంట్ గేట్‌వే సర్వీసులు లాంచ్ చేసింది. దీం ఎంఎస్ఎంఈలు లక్ష్యంగా ఫోన్‌పే ఈ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు. పేటీఎం, రాజోర్‌పే, పేయూ, పైన్ ల్యాబ్స్ వంటి ఇతర సంస్థల జాబితాలోకి ఇప్పుడు ఫోన్‌పే కూడా వచ్చి చేరింది. ఫోన్‌పే కొత్త సేవల ఆవిష్కరణ సందర్భంగా యూజర్లకు ఉచితంగానే పలు రకాల బెనిఫిట్స్ అందిస్తోంది. సెటప్ ఫీజు ఉండదు. ఇంకా వార్షిక మెయింటెనెన్స్ కాస్ట్ ఉండదు. దీని వల్ల ఎంఎస్ఎంఈలకు బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. చాలా వరకు సంస్థలు పేమెంట్ గేట్‌వేస్.. ట్రాన్సాక్షన్ ఫీజు కింద 2 శాత వసూలు చేస్తుంటాయి. వ్యాపారులకు ఊరట కలిగించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. మంత్లీ సేల్స్ రూ. కోటి వరకు కలిగిన వ్యాపారులకు నెలకు రూ. 2 లక్షల వరకు ఆదా కావొచ్చని కంపెనీ పేర్కొంటోంది. వ్యాపారులు ఉచితంగానే ఫోన్‌పే గేట్‌వే సర్వీసులు పొందొచ్చు. కాగా ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుందని గుర్తించుకోవాలి. ఇలా ఫోన్‌పే గేట్‌వే ప్లాట్‌ఫామ్‌లోకి చేరే వారికి రూ. 8 లక్షల వరకు ఆదా అవుతుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ డబ్బులను ఇతర వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మరింత బెనిఫిట్ పొందొచ్చు. ఫోన్‌పే పేమెంట్ గేట్‌వే అంశంపై ఫ్లవర్ ఆదా అడ్ బకింగో కోఫౌండర్ సుమన్ పత్ర మాట్లాడుతూ.. ఈకామర్స్ బిజినెస్ కలిగిన వారికి నమ్మకమైన పేమెంట్ గేట్‌మే ఉండాల్సిందేనని తెలిపారు. ఫోన్‌పే వంటి భాగస్వామిని కలిగి ఉండటం చాలా సంతోషకరమైన అంశమని పేర్కొన్నారు. కస్టమర్లకు మెరుగైన సర్వీసులు అందించడానికి ఫోన్‌పే తనమకు చాలా దోహడపడుతోందని తెలిపారు. డ్రాప్ ఆఫ్స్ తగ్గాయని, ఓవరాల్ పేమెంట్ సక్సెస్ రేటు పెరిగిందని పేర్కొన్నారు. అలాగే ఫోన్‌పే ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్‌గా ఉంటుందని తెలిపారు. మర్చంట్ సపోర్ట్ కూడా ఎక్సలెంట్‌గా ఉందని పేర్కొన్నారు. ఫోన్‌పే ఇప్పటికే యూపీఐ మార్కెటలో 50 శాతానికి పైగా వాటాను ఆక్రమించి ఉంది. అంటే ఫోన్‌పే చాలా ట్రాన్సాక్షన్లను సులభంగానే నిర్వహిస్తోంది. పెద్ద మొత్తంలోని లావాదేవీలను కూడా ఫోన్‌పే సింపుల్‌గా హ్యాండిల్ చేయగలదు. వ్యాపారులకు బెస్ట్ ఇన్ క్లాస్ సర్వీసులు అందించడానికి ఇప్పుడు పేమెంట్ గేట్‌వే విభాగంలోకి అడుగుపెట్టింది.
ఫోన్‌పే కొత్త సేవల ఆవిష్కరణ !
June 18, 2023
0
Tags