ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా జీవీఎంసీ పరిధిలోని కూర్మన్నపాలెంకు చెందిన ఎస్.మహాలక్ష్మి, గాజువాకకు చెందిన శ్రీనివాస్‌కుమార్ సోమవారం అచ్యుతాపురంలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నారు. ఈ క్రమంలో లాడ్జిలో మహాలక్ష్మి, శ్రీనివాస్ కత్తితో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అనుకున్నారు. అయితే లాడ్జి సిబ్బంది చూసేసరికి ఇద్దరూ కత్తితో కోసుకున్న గాయాలతో కనిపించారు. వెంటనే లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహాలక్ష్మి, శ్రీనివాస్ కుమార్‌ను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మహాలక్ష్మి మృతి చెందగా, శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మహాలక్ష్మిని హతమర్చడానికి ముందుగానే పథకం ప్రకారం కత్తులు, మత్తు ఇంజెక్షన్ లు తీసుకొని వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారమే మహాలక్ష్మిని శ్రీనివాస్ హత్య చేశాడని ఆరోపిస్తున్నారు మృతురాలి బంధువులు. కేసు నుంచి తప్పించుకోవడానికే తనపై కూడా దాడి జరిగినట్టు డ్రామా ఆడాడని ఆరోపిస్తున్నారు. మహాలక్ష్మిపై కక్ష పెంచుకొని ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని, తమ బిడ్డను తమకు కాకుండా చేసిన శ్రీనివాస్ ను ఉరి తీయ్యాలని మహాలక్ష్మి బంధువులు కేజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు.
పథకం ప్రకారమే మహాలక్ష్మి హత్య ?
May 30, 2023
0
Tags