కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి మీద బదిలీ వేటు వేసిన సిద్దరామయ్య ప్రభుత్వం అనేక మంది ఐపీఎస్ అధికారులకు బదిలీ చేసింది. బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ గా ప్రతాప్ రెడ్డి 2022 మే 17వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ రెడ్డి ఇంకా కొంతకాలం పాటు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతాప్ రెడ్డి బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్ గా బదిలీ కావడం, అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం మొదలైయ్యింది. బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డిని సెక్యూరిటీ విభాగం డీజీపీగా నియమించారు. బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి బి. దయానంద్ ను నియమిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బెంగళూరు ట్రాఫిక్ విభాగం అడిషనల్ పోలీసు కమీషనర్ గా పని చేస్తున్న ఎంఏ. సలీమ్ ను సీఐడీ డీజీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో సీనియర్ పోలీసు అధికారి శరత్ చంద్రాను కర్ణాటక ఇంటలిజెన్స్ విభాగం డీజీపీగా నియమిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు సిటీ పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డి బదిలీ !
May 30, 2023
0
Tags