బెంగళూరులో పంక్చర్‌ మాఫియా !

Telugu Lo Computer
0


బెంగళూరు పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ మేకులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఆ రోడ్డు గుండా వెళుతోన్న వాహనాలు పంక్చర్‌ అవుతున్నాయి. అయితే ఆ మేకులను కొందరు ఉద్దేశపూర్వకంగా వేసినవే కావడం గమనార్హం. పంక్చర్‌ దుకాణం ఉన్న చోటుకు కిలోమీటర్‌ పరిధిలో రహదారులు, కూడళ్ల వద్ద చిన్న మేకులు, మొనదేలి ఉన్న తీగలను వేస్తున్నారు. ఇవి గుచ్చుకోగానే టైర్లు, ట్యూబులు పంక్చర్‌ అవుతున్నాయని, దీంతో మరో అవకాశం లేక ఆ మార్గంలో ఉన్న పంక్చర్‌ దుకాణాల్లోనే రిపేర్‌ చేసుకునే పరిస్థితి నెలకొంది. దీంతో ఇటీవల ఇలాంటి ఫిర్యాదులు పెరగడంతో పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఆనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్‌ చుట్టుపక్కల నిత్యం కిలోకు పైగా మేకులు, ఇనుప తీగలను పోలీసులు ఈ మధ్య కాలంలో సేకరించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దీనికి చెక్‌ పెట్టవెచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)