ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట లోని ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువుల లీక్ అయి ముగ్గురు కార్మికులు తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు. విషవాయువు పీల్చడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. బాధితులను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. అస్వస్థతకు గురైన బాధితులను గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివప్రసాద్, అస్సాం రాష్ట్రానికి చెందిన జిహిరుల్ రెహమాన్, అబీబ్‌గా గుర్తించారు. ఆటోనగర్‌లో యస్‌యల్ ఫార్మా కంపెనీని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పారిశ్రామిక అధికారులు పరిశీలించి మూసివేశారు. ఆర్డీవో రవీంద్రరావు విషవాయువు విడుదలపై విచారణకు ఆదేశించారు. ఎస్‌ఎల్ ల్యాబ్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిర్మాణానికి మాత్రమే అనుమతులు ఇచ్చామని, ఉత్పత్తులకు ఇంకా అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. అనుమతులు లేకుండా కంపెనీలో ఉత్పత్తి ప్రారంభించడంపై విచారణ జరుపుతామని, అస్వస్థతకు గురైన కార్మికుల రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతామని తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో ఉత్పత్తిని నిలుపుదల చేయించామని, యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదికను సమర్పించాలని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధికారులను ఆదేశించారు.
ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువుల లీక్ !
May 28, 2023
0
Tags