శర్వానంద్‌కి రోడ్డు ప్రమాదం

Telugu Lo Computer
0


శర్వానంద్‌కి నిన్న అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన వెళ్తున్న రేంజ్ రోవర్ కారు.. ఫిల్మ్ నగర్‌లోని జంక్షన్ దగ్గర అదుపుతప్పి  బోల్తా పడింది. అందువల్ల శర్వానంద్‌కి చిన్నగా గాయాలు అయ్యాయి. ఇది గమనించిన అక్కడి వారు వెంటనే స్పందించారు. శర్వానంద్‌ను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో శర్వానంద్ కుటుంబ సభ్యులు హడావుడిగా ఆస్పత్రికి వచ్చారు. ఏమైందనీ, పరిస్థితి ఎలా ఉంది అని డాక్టర్లను విషయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం శర్వానంద్‌ పరిస్థితి బాగానే ఉందనీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం నుంచి శర్వానంద్ కారును కుటుంబ సభ్యులు తీసుకెళ్లిపోయారు. రేంజ్ రోవర్ కారు కావడం వల్ల సేఫ్టీ ఫీచర్స్ ఉండటం వల్ల పెద్దగా గాయాలు కాలేదని తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)