మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా పచ్ గావ్ లో నివసించే గిరీష్ పాటిల్ కు ఐదు నెలల క్రితం కూతురు పుట్టగా ఆయన సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ముద్దుగా ఆమెకు ఐరా అని పేరు పెట్టుకున్నాడు. తొలిసారిగా నిన్న చిన్నారి ని తన ఇంటికి తీసుకొని వచ్చాడు. దీంతో ఆమెకు ఘన స్వాగతం పలకడానికి హంగామా చేశాడు. ఏనుగు పై ఉరేగిస్తూ, డప్పు వాయిద్యాల మధ్య, తన బిడ్డను అందరికీ చూపిస్తూ ఇంటికి ఘనంగా తీసుకు వెళ్ళాడు గిరీష్ పాటిల్. 35 ఏళ్ల తర్వాత తమ వంశంలో ఆడపిల్ల పుట్టిందని, ఎంతో కాలంగా ఆడపిల్ల కోసం తమ వంశం ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇంత కాలం తర్వాత తమకు ఆడపిల్ల పుట్టడంతో సంతోషంగా ఉన్నామని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆడపిల్ల పుట్టిందన్న ఆనందంతో ఏనుగుపై ఊరేగింపు !
May 28, 2023
0
Tags