హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం వరకు భగభగలతో అల్లాడిపోయిన భాగ్యనగరం ఒక్కసారిగా చల్లబడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్‌బీ, దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం కారణంగా నగరం నీట మునిగింది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 40°C నుండి 43 °C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 38°C నుండి 41°C వరకు నమోదు అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.ఆది, సోమ వారాల్లో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షములు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో భారీ వర్షం !
May 28, 2023
0
Tags