ఢిల్లీ లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నేడు నాల్గవ చార్జిషీట్ దాఖలు చేసింది. పలు అభియోగాలతో కూడిన పత్రాలను రౌస్ అవెన్యూ కోర్టుకు అందజేసింది. ఇందులో బాగంగా కోర్టు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు మరోసారి నోటీసులు జారీచేసింది. ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ గత చార్జిషీట్లలో మోపిన అభియోగాలనే ఈడీ మరోమారు ప్రస్తావించింది. లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను పలుమార్లు ప్రశ్నించగా, ఈ కేసులో ప్రశ్నించిన 51 మంది వివరాలను, వారి సమాధానాలను మరోమారు అభియోగ పత్రంలో ఈడీ పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో నాల్గవ చార్జిషీట్ దాఖలు !
May 30, 2023
0
Tags