ఐఆర్‌సీటీసీ టూరిజం కేరళకు టూర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి కేరళ హిల్స్ అండ్ వాటర్స్ పేరుతో టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. కేవలం రూ.12,000కే ఆరు రోజుల ప్యాకేజీ అందుబాటులో ఉండటం విశేషం. ఈ రైల్ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారు కేరళలోని మున్నార్, అలెప్పీ అందాలు చూడొచ్చు. ఇది 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ. ప్రతీ మంగళవారం హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ మొదటి రోజు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న పర్యాటకులు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. మొదటి రోజంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు బుధవారం మధ్యాహ్నం 12.55 గంటలకు పర్యాటకులు ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ బయల్దేరాలి. సాయంత్రం ఖాళీ సమయం ఉంటుంది. మున్నార్‌లో విహరించవచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. మూడో రోజు గురువారం సైట్ సీయింగ్ ఉంటుంది. పర్యాటకులు ఎరవికుళం నేషనల్ పార్క్, టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్ చూడొచ్చు. రాత్రికి మున్నార్‌లో బస చేయాలి. నాలుగో రోజు శుక్రవారం అలెప్పీ బయల్దేరాలి. దారిలో బ్యాక్‌వాటర్స్ చూడొచ్చు. రాత్రికి అలెప్పీలో బస చేయాలి. ఆరో రోజు ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. గ్రూప్ బుకింగ్ చేసేవారికి ధర తక్కువగా ఉంటుంది. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.12,130, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.14,510 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.14,840, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.17,220 చెల్లించాలి. 4 నుంచి 6 మంది గ్రూప్ బుకింగ్ చేస్తే ఈ ప్యాకేజీ ధరలు వర్తిస్తాయి. 1 నుంచి 3 మంది బుకింగ్ చేసేవారికి ధరలు వేరేలా ఉన్నాయి. స్టాండర్డ్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.12,420, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.16,040, సింగిల్ షేరింగ్ ఒకరికి రూ.29,520 చెల్లించాలి. కంఫర్ట్‌లో ట్రిపుల్ షేరింగ్ ఒకరికి రూ.15,130, ట్విన్ షేరింగ్ ఒకరికి రూ.18,740, సింగిల్ షేరింగ్‌కు రూ.32,230 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్ ప్రయాణం, కంఫర్ట్ ప్యాకేజీలో ఏసీ ప్రయాణం, ఏసీ వాహనంలో సైట్‌సీయింగ్, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
హైదరాబాద్ టూ కేరళ హిల్స్ అండ్ వాటర్స్ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ !
April 28, 2023
0
Tags