హైదరాబాద్ నగర శివార్లలోని సంగారెడ్డి జిల్లా బీరంగూడెం కమాన్ దగ్గర ఉన్న సాయి భగవాన్ కాలనీలో ఐటీ కంపెనీలో పనిచేసే నిరూప్ నివాసం ఉంటున్నారు. విజయవాడలో తన తమ్ముడు నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి బస్సులో హైదరాబాద్ వచ్చారు. బస్సు దిగి ఇంటికి వెళుతున్న సమయంలో నగల బ్యాగ్ ను పోగొట్టుకున్నాడు. బీరంగూడకు చెందిన నరేందర్ ఆటో స్టాండ్ దగ్గర నగలు ఉన్న బ్యాగ్ ను గుర్తించాడు. బ్యాగ్ తెరిచి చూడగా అందులో నగలు ఉన్నాయి. అడ్రస్ కూడా లేదు. నరేందర్ ఆ నగల బ్యాగ్ ను రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ అప్పగించాడు. బ్యాగ్ ను తీసుకున్న సీఐ సంజయ్ కుమార్ విచారణ చేసి నగల బ్యాగ్ పోగొట్టుకున్న నిరూప్ ను గుర్తించి బ్యాగ్ అందజేశారు. ఈ సమయంలో ఎంతో నిజాయితీతో నగల బ్యాగ్ ను అప్పగించిన నరేందర్ ను పోలీస్ స్టేషన్ లో సీఐ సంజయ్ కుమార్, ఇతర పోలీస్ సిబ్బంది నన్మానించారు. బ్యాగులోని నగల విలువ 25 లక్షల రూపాయలు అని.. ఎంతో నిజాయితీతో అప్పగించిన నరేందర్ కు నిరూప్ కృతజ్ణతలు తెలిపారు.
నిజాయితీకి నిదర్శనం !
April 28, 2023
0
Tags